---Advertisement---

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్

అంబేద్క‌ర్‌పై అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్
---Advertisement---

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ, అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్య‌స‌భ‌లో రాజ్యంగంపై చ‌ర్చ‌లో అమిత్ షా మాట్లాడుతూ.. “ఈమధ్య అంబేద్కర్, అంబేద్కర్ అనడం ఫ్యాషన్‌గా మారింది. వాళ్లు అన్నిసార్లు అలా అనడం కంటే దేవుడి పేరును స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుంది” అని వ్యాఖ్యానించారు.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు అంబేద్క‌ర్ వాదులు తీవ్రంగా ప‌రిగ‌ణించారు. షా వ్యాఖ్యలను అంబేద్కర్‌పై అవమానకరంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. హోంమంత్రి వెంటనే క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

బీజేపీ స్పందన
బీజేపీ ప్రతినిధులు సైతం కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీనే అవమానించిందని ఆరోపించారు. అమిత్ షా తన ప్రసంగంలో అంబేద్కర్‌పై గౌరవ భావాన్ని స్పష్టంగా చూపించారని పేర్కొన్నారు. ఈ వివాదం పార్లమెంట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది, ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment