అమెరికాలోని ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

అమెరికాలోని ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

అమెరికా (America)లో మరో భయానక పారిశ్రామిక ప్రమాదం సంభవించింది. టెనస్సీ (Tennessee) రాష్ట్రంలోని హంఫ్రీస్ (Humphreys) కౌంటీలో ఉన్న ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారం (Factory)లో భారీ పేలుడు చోటుచేసుకుంది. సైనిక, అంతరిక్ష, వాణిజ్య అవసరాల కోసం పేలుడు పదార్థాలు తయారు చేసే ఈ ప్లాంట్‌లో ఉదయం 7:45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది మృతి (Death) చెందినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి కర్మాగారం చుట్టుపక్కల ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.

రక్షణ చర్యల్లో ఆటంకం
పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా శిథిలమైపోయింది. హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ (Sheriff Chris Davis) మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా వినాశకరమైన ఘటన. పలువురు ఇంకా కనిపించడం లేదు, కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు” అని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, మంటలు తీవ్రంగా ఉండటంతో రక్షణ చర్యలు ఆలస్యం అయ్యాయి. శిథిలాలలో ఇంకా పలువురి మృతదేహాలు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు తెలిపారు.

భయంతో వణికిన స్థానికులు
పేలుడు శబ్ధం విన్న స్థానికులు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలు ఇంకా తెలియరాలేదు, అయితే రసాయన పదార్థాల లీకేజీ లేదా సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment