అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్క‌ర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్క‌ర్‌ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండలు వేసి రాజ్యాంగ నిర్మాత‌ను ఘోరంగా అవమానించారు. ఈ ఘ‌ట‌న‌పై దళిత సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. విగ్రహానికి అవమానం జరిగిందన్న వార్త తెలిసిన వెంటనే దళిత సంఘాల నేతలు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసన చేపట్టారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నిందితులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కూట‌మి పాల‌న‌లో రాజ్యాంగ నిర్మాత‌కు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని స్థానిక ప్ర‌జ‌లు, ద‌ళిత సంఘాల ప్ర‌తినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment