ఫోన్ మాట్లాడొద్దన్నాడ‌ని భర్తను గొడ్డ‌లితో న‌రికిన భార్య‌.. అల్లూరి జిల్లాలో దారుణం

ఫోన్ మాట్లాడొద్దన్నాడ‌ని భర్తను గొడ్డ‌లితో న‌రికిన భార్య‌.. అల్లూరి జిల్లాలో దారుణం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Sitarama Raju District) ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. చింతపల్లి మండలం, లోతుగడ్డ పంచాయతీ పరిధిలోని మేడూరు గ్రామంలో (Meduru Village) జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

వివరాల్లోకి వెళితే.. మేడూరు గ్రామానికి చెందిన కొర్ర రాజారావు (Korra Rajarao) త‌న భార్య తరచూ మొబైల్ ఫోన్‌ (Mobile Phone)లో ఎక్కువగా మాట్లాడుతుంద‌ని గ‌మ‌నించాడు. ఎక్కువగా ఫోన్ మాట్లాడొద్ద‌ని తన భార్యకు సున్నితంగా సూచించాడు. భర్త మందలింపుతో ఆగ్రహం చెంది భార్య(Wife) తీవ్ర ఉద్రిక్తతకు లోనై, ఉన్నట్టుండి గొడ్డలి (Axe)తో రాజారావుపై దాడికి పాల్పడింది.

తీవ్రంగా గాయపడిన రాజారావును స్థానికులు వెంటనే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం (Visakhapatnam)లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)కు రిఫర్ చేశారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక, రాజారావు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు కుటుంబ వివాదం ఇంత పెద్ద విషాదానికి దారితీసిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment