అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్

అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్

చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మర్చిపోక ముందే, అల్లూరి జిల్లాలో మరో అమానుష సంఘటన చోటుచేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. లంబసింగి నుంచి విశాఖకు తీసుకెళ్లి అక్క‌డ మూడు రోజులపాటు బాలికపై అత్యాచారం చేసి, అనంతరం నర్సీపట్నంలో వదిలేసినట్లు సమాచారం.

బాధిత బాలిక కుటుంబ సభ్యులకు ఘటన వివరాలు చెప్పడంతో, వారు చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కలెక్టర్‌ను ఆశ్రయించగా, ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో చోట రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. “మహిళా రక్షణ ప్రభుత్వానికి పట్టదా?” అంటూ బాధితురాలి కుటుంబం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాష్ట్రవ్యాప్తంగా వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ తరహా సంఘటనలు మహిళా భద్రతపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బాలికకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment