అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. డేట్ ఫిక్స్!

అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. డేట్ ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత అల్లు అర‌వింద్ ఆఖ‌రి క‌నిష్ట పుత్రుడు అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియురాలు నయనికతో కలిసి వచ్చే ఏడాది మార్చి 6న ఏడడుగులు వేయనున్నట్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త అల్లు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

అల్లు శిరీష్‌ పెళ్లిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఇదే తేదీన ఆయన అన్నయ్య అల్లు అర్జున్ (Allu Arjun) కూడా వివాహం చేసుకున్నారు. 2011లో స్నేహారెడ్డిని వివాహమాడిన బన్నీకి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్నయ్య పెళ్లి జరిగిన రోజే తమ్ముడు కూడా ఒక ఇంటివాడు కావడం అల్లు కుటుంబంలో అరుదైన, విశేషమైన సంఘటనగా నిలుస్తోంది.

అల్లు కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకాబోతుండటంతో మెగా అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి డేట్ (Wedding Date) ఫిక్స్ చేస్తూ అల్లు వారి వార‌సుల‌తో శిరీష్ చేసిన రీల్ వైర‌ల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment