అల్లు కుటుంబానికి GHMC షాక్

అల్లు కుటుంబానికి GHMC షాక్

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అనుమతులకు మించి పెంట్‌హౌస్‌ నిర్మించారని. దీనిపై అధికారులు నోటీసులు జారీ చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నం. 45లో ఉన్న ఈ భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి నాలుగు అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే, తాజాగా అదనంగా ఒక పెంట్‌హౌస్‌ నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అక్రమంగా నిర్మించిన పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చివేయకూడదో వివరించాలని కోరుతూ అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసులు పంపారు. గతంలో, నటుడు అల్లు అర్జున్ కుటుంబం తమ తాత అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా నవంబర్ 2023లో ఈ నిర్మాణ పనులను ప్రారంభించింది.

గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి అల్లు కుటుంబ వ్యాపారాలకు ప్రధాన కార్యాలయంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, ప్రస్తుతం అనుమతులు లేని నిర్మాణం కారణంగా అధికారులు దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment