టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరొందిన అల్లు (Allu) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) గారి సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) (94) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, అర్థరాత్రి తుది శ్వాస విడిచారు.
తన నానమ్మ మృతి వార్త తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై (Mumbai) నుంచి హుటాహుటిన హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు ఫ్యామిలీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కనకరత్నమ్మ మరణ వార్త తెలిసి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.







