‘తండేల్’ టికెట్ ధ‌ర‌ల‌పై అల్లు అర‌వింద్ హాట్ కామెంట్స్‌

'తండేల్' టికెట్ ధ‌ర‌ల‌పై అల్లు అర‌వింద్ హాట్ కామెంట్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య‌-సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన మూవీ తండేల్ నేడు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణం జ‌రిగిన ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నిర్మాత అల్లు అర‌వింద్ చేసిన కామెంట్స్ హైలైట్‌గా మారాయి.

హైద‌రాబాద్‌లో తండేల్ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు నిర్మాత అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌కుడు చందూ, హీరో అక్కినేని నాగ‌చైత‌న్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రిపోర్ట‌ర్ తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల‌పై ప్ర‌శ్న అడిగారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదు. అడగాల్సిన అవసరం లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచమని అడిగాము అది కూడా వారం రోజుల‌కు టికెట్‌పై 50 రూపాయలు మాత్రమే అని స‌మాధానం ఇచ్చారు. హైద‌రాబాద్‌లో టికెట్ రేట్లు ఆల్రెడీ పెరిగే ఉన్నాయ‌ని అల్లు అర‌వింద్ చెప్పారు.

నిర్మాణ అల్లు అర‌వింద్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. పుష్ప‌-2 సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో అల్లు అర్జున్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment