గతేడాది డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప-2 సినిమా థియేటర్లలో సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల పుష్ప-2 ఓటీటీ వేదికపై కూడా తన హవా కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ మాస్ అటిట్యూడ్, ఫాహద్ ఫాజిల్ విలనిజం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రష్మిక నటన సినిమాలోని అన్ని ఫ్యాక్టర్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప-2 హవా
పుష్ప-2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ సంపాదించి, ఓటీటీ రికార్డులను తిరగరాస్తోంది. అంతేకాక, ఏకంగా 7 దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని టాప్-ట్రెండింగ్‌గా నిలిచింది.
ఇంగ్లీషేతర చిత్రాల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ట్రెండ్ అవుతూ, సినిమా క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో పుష్ప-2 రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ అదే దూకుడు కొనసాగుతుండటంతో, ఈ మూవీ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.