ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ భారీ వసూళ్లు సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 సక్సెస్ మీట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పుష్ప సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు బన్నీ.
అలాగే ‘పుష్ప 3’ గురించి తాజాగా బన్నీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ చివర్లో మాట్లాడుతూ “అదేంటో నీకూ తెలియదు.. నాకూ తెలియదు” అంటూ దర్శకుడు సుకుమార్‌ను ఉద్దేశించి కామెంట్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆయన మాటలు విన్న వెంటనే ‘పుష్ప 3’పై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
అలాగే, తన సినిమా విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తానని, మరింత గర్వపడేలా చేస్తానని బన్నీ పేర్కొన్నాడు. మరి,‘పుష్ప 3’ అనూహ్యంగా అనౌన్స్ అవుతుందా? లేక ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ మీద క్లారిటీ రాదా? అన్నది చూడాలి.