బన్నీ టీ-షర్ట్.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు కౌంట‌ర్‌?

బన్నీ టీ-షర్ట్.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు కౌంట‌ర్‌?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఏం చేసినా అది వైరల్ కావడం కొత్తేమీ కాదు. కానీ తాజాగా ఆయన ధరించిన ఓ టీ-షర్ట్ (T-shirt) మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అందులో ‘అనగనగా ఒక రోజు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఫేమ‌స్‌ డైలాగ్ – “నెల్లూరి పెద్ద రెడ్డి తాలూకా” (“Nelluri Pedda Reddy Thaluka”) అని ఉంది.

ఇంతవరకూ సరే గానీ, ఇదంతా ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ గొప్పగా చెప్పుకునే జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ అభిమానుల (Pawan Kalyan Fans)పై బన్నీ వేసిన స్టైల్ కౌంటర్ (Stylish Counter) అనే అభిప్రాయం నెట్టింట చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి పవన్ ఫ్యాన్స్ ఈ టీ-షర్ట్ వెనుక అర్థం వెతకడం మొదలుపెట్టారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప‌వ‌న్‌-బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే బన్నీ ఈ టీ-షర్ట్‌ను కేవలం ఫన్‌కు మాత్రమే ధ‌రించిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకే ధ‌రించాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ బన్నీ vs పవన్ ఫ్యాన్స్ మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment