‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మెగా-అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ బట్టబయలు అయ్యింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌పై పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్లు పడ్డాయి. ఎవరు ఎంత పై స్థాయికి వచ్చినా.. తమ మూలాలు మరిచిపోకూడదంటూ పరోక్షంగా అల్లు అర్జున్ కు చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. ఎక్కడ నుండి వచ్చామో ఆ మూలాలు అసలు మరిచిపోకూడదన్నారు. నేను పవర్ స్టార్ అయినా, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి చేరినా, ఈ మూలాలు మా అన్న మెగాస్టార్ చిరంజీవి నుంచే వచ్చాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. మనం ఏ స్థాయికి వెళ్లినా మూలాలు మారచి పోకూడదంటూ బన్నీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్పీచ్ కొనసాగినట్లుగా పలువురు అనుకుంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బాగా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే తన అన్న కొడుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్
మూవీ ఈవెంట్‌లో ఆ రివేంజ్ తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. గత కొంతకాలంగా అల్లు కంపౌండ్ కు మెగా ఫ్యామిలీకి అంతగా పొసగడం లేదని వార్తలు వింటూనే ఉన్నాం. అల్లు అర్జున్.. తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అంటూ మెగా ఫ్యామిలీని వేరు చేస్తూ మాట్లాడిన మాటలు మెగాభిమానులను మంటెక్కించాయి. దీనికి పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేదికగా చేసుకొని డైరెక్ట్ గా పేరు చెప్పకుండా అల్లు అర్జున్ కు బాగానే కౌంటర్ ఇచ్చాడని మెగా ఫ్యామిలీ అభిమానులు చంకలు గుద్దుకుంటున్నారు.