అల్లు అర్జున్‌కు ప్రత్యేక ఫ్యాన్స్‌ అసోసియేషన్.. కారణం అదేనా?

అల్లు అర్జున్‌కు ప్రత్యేక ఫ్యాన్స్‌ అసోసియేషన్.. కారణం అదేనా?

టాలీవుడ్‌ (Tollywood)లో ఇప్పటికే అగ్ర హీరోలందరికీ సొంత అభిమాన సంఘాలు ఉండగా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అదే బాట పట్టారు. ఆయన తన అభిమానుల సైన్యాన్ని వ్యవస్థీకృతం చేసుకునేందుకు ప్రత్యేకంగా “Allu Arjun Fans Association” ను ప్రారంభించారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా అభిమాన సంఘాల ద్వారానే కార్యకలాపాలు నిర్వహించేవారు. అయితే, మెగా ఫ్యాన్స్‌లో కొందరి నుంచి నిరంతరంగా ఎదురవుతున్న ట్రోల్స్, విభేదాల నేపథ్యంలో తమకంటూ ఒక ప్రత్యేక సంఘం ఉండాలని బన్నీ అభిమానులు బలంగా కోరుకున్నారు.

ముఖ్యంగా ‘పుష్ప 2’ విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆ సంఘటనలో అరెస్ట్ అయినప్పుడు, తనకు మద్దతుగా నిలబడటానికి వ్యవస్థీకృత అభిమాన సంఘం లేకపోవడం వలన తలెత్తిన ఇబ్బందులను ఆయన బలంగా గ్రహించారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సరైన అధికారిక సంఘం లేకపోవడంతో, ఆ సమయంలో సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారని ఆయన భావించారట.

ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా కమిటీ సభ్యులను ఎన్నుకుంటూ “Allu Arjun Fans Association” ఏర్పాటైంది. ఈ నూతన సంఘం ద్వారా అల్లు అర్జున్ తన అభిమానుల కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సంచలన నిర్ణయం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment