---Advertisement---

కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన అల్లు అర్జున్

కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన అల్లు అర్జున్
---Advertisement---

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ స్పందించారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనతో బాధపడుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తాన‌న్న హామీకి తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

“న్యాయ సలహాల ప్రకారం..”
“ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో, న్యాయ నిపుణుల సూచన మేరకు నేను శ్రీతేజ్, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ‌నిపుణులు తెలిపారు. అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నేను ప్రార్థిస్తున్నాను. శ్రీతేజ్ చికిత్స ఖర్చులు, కుటుంబ అవసరాలకు నేను అండగా ఉంటాననే హామీ ఇస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తాను” అని బ‌న్నీ చెప్పారు.

అభిమానుల స్పందన
అల్లు అర్జున్ ఈ ఘటనపై చూపించిన సానుభూతిని అభిమానులు ప్రశంసిస్తున్నారు. “ఒక తారగా మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అల్లు అర్జున్ నిలుస్తున్నారు” అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. కోర్టు విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ వ్యక్తిగతంగా శ్రీతేజ్‌ను కలవనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment