అల్లు అర్జున్ సిస్ట‌ర్‌గా నజ్రియా?

అల్లు అర్జున్ సిస్ట‌ర్‌గా నజ్రియా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బన్నీ సోదరి పాత్ర కోసం నజ్రియా నజీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకి బాగా ఎమోషనల్ డెప్త్ ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు ఆడియన్స్‌కి నజ్రియా పరిచయం ‘రాజా రాణి’ సినిమాతో కలిగింది. తర్వాత నాని సరసన ‘అంటే సుందరానికి’ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేయనున్నట్టుగా వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ పాత్రకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment