---Advertisement---

నేడు నాంపల్లి కోర్టుకు బ‌న్నీ.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

నేడు నాంపల్లి కోర్టుకు బ‌న్నీ.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌
---Advertisement---

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న నాంప‌ల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండడంతో, ఈ కేసులో తాజా పరిణామాలపై అందరి దృష్టి నిలిచింది.

అర్జున్ తరపున న్యాయవాదుల వాదనలు
హైకోర్టు ఇటీవల ఈ కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విష‌యాన్ని నాంప‌ల్లి కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చి, రెగ్యుల‌ర్ బెయిల్ కోసం అప్పీల్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పోలీసులు కూడా బ‌న్నీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ ప‌రిస్థితుల్లో కోర్టు తీర్పు ఏ మలుపు తిరుగుతుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. కాగా, అల్లు అర్జున్ వ‌ర్చువ‌ల్‌గా కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment