చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను చూసి కుటుంబం భావోద్వేగానికి లోనైంది. కుటుంబాన్ని పలకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతిచెందడం అత్యంత బాధాకరం. దీనిపై నేను తీవ్రంగా చింతిస్తున్నాను. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూస్తున్నా, కానీ ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదు. బాధిత కుటుంబానికి నా పూర్తి మద్దతు ఉంటుంది
అన్నారు.
అల్లు అర్జున్ అరెస్టుతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో అరెస్టును ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.