ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ అందించింది. గతంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిన నిబంధనను కోర్టు తాజాగా మినహాయించింది. అల్లు అర్జున్ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, అవసరమైన అనుమతులు ఇచ్చింది. అంతేకాక, బన్నీకి విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అభిమానుల హర్షం
ఈ నిర్ణయం అభిమానుల్లో హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ త్వరలోనే తన తదుపరి సినిమాల షూటింగ్‌లు ప్రారంభించనున్నారు. కోర్టు ఈ నిర్ణయంతో ఆయన ప్రాజెక్టులపై ఉన్న అడ్డంకులు తొలగాయి.