అల్లు అర్జున్ వివాదంపై మంచు విష్ణు సంచలన నిర్ణ‌యం

అల్లు అర్జున్ వివాదంపై మంచు విష్ణు సంచలన నిర్ణ‌యం

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ తొక్కిస‌లాట ఘ‌ట‌న వివాదాస్ప‌ద‌మైంది. ఈ విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా స్పందిస్తుండ‌టంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై కీలక ప్రకటన చేశారు. ఈ వివాదంపై ఎవ్వరూ స్పందించకూడదని మా సభ్యులకు స్పష్టం చేశారు.

సభ్యులకు మంచు విష్ణు సూచనలు..
ఈ అంశం చాలా సున్నితమైనది కావున, మా సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా బయట పెట్టరాదని విష్ణు సూచించారు. అలాంటి అంశాల‌పై చర్చలు జరగడం పరిశ్రమకు ద్రోహంగా మారుతుందని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు అల్లు అర్జున్ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతిస్పందనలు నిలిపివేత
మంచు విష్ణు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ వ్యవహారంపై స్పందించడం పరిశ్రమలో వ్యక్తిగత, సంఘటిత సంబంధాలను దెబ్బతీస్తుందని అర్థమవుతోంది. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి అంశం ఎలాంటి వైపుగా వెళ్లకూడదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment