ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డేను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ తన తండ్రితో స్వయంగా కేక్ కట్ చేయించి, ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత మధురంగా మార్చారు. వేడుకలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. ఆసక్తికరంగా, కేక్‌పై “పుష్ప కా బాప్” అని రాసి ఉండడం అందరిని ఆకట్టుకుంది. ఈ ఫొటోలను బన్నీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF
— Allu Arjun (@alluarjun) January 10, 2025








