---Advertisement---

అల్లు అర్జున్ కేసు.. ఏపీ vs తెలంగాణ

అల్లు అర్జున్ కేసు.. ఏపీ vs తెలంగాణ
---Advertisement---

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసు మెల్ల‌మెల్ల‌గా రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. తెలంగాణ‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంద‌ని ఇటీవ‌ల సీఎం నుంచి కిందిస్థాయి కార్య‌క‌ర్త వ‌ర‌కు చేసిన కామెంట్స్ నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. తొలుత ఇది “అర్జున్ vs పోలీసులు”గా, తర్వాత “అర్జున్ vs రేవంత్”గా సాగిన నెరేటివ్ ఇప్పుడు “ఏపీ vs తెలంగాణ”గా మారింది.

ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు “ఆంధ్రావాళ్లు ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది. వీటితో ఆ పార్టీ వైఖరిపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నేతల వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు జాతీయ అవార్డు ద‌క్క‌డంపై కూడా కాంగ్రెస్ మంత్రి సీత‌క్క‌, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సైతం ప్ర‌శ్నించారు. మ‌రో ఎమ్మెల్సీ వెంక‌ట్ బ‌న్నీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ క్ష‌మ‌ప‌ణ‌లు డిమాండ్ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారా­యణమూర్తి చేసిన వ్యాఖ్యలు బ‌న్నీ సినిమాను టార్గెట్‌గా ఉన్నాయ‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు. ఎవరి బెనిఫిట్‌ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment