బన్నీ-అట్లీ సినిమాకు అభ్యంక‌ర్‌ మ్యూజిక్

బన్నీ-అట్లీ సినిమాకు అభ్యంక‌ర్‌ మ్యూజిక్

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స‌క్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కబోయే AA26 నిన్న బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కేవలం 21 ఏళ్ల సాయి అభ్యంకర్ (Sai Abhyankar) సంగీతాన్ని (Music) అందించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఈ యువ సంగీత దర్శకుడు ‘SURYA45’ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్థానాన్ని దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టిప్పు-హరిణి (Tipu-Harini) అనే ప్రముఖ గాయకుల కుమారుడైన సాయి అభ్యంకర్, గతేడాది విడుదలైన క‌ట్చిసెరా (Katchi Sera) పాటతో యూ‌ట్యూబ్‌లో 221 మిలియన్ల వ్యూస్ సాధించాడు.

అంతేకాదు, మీనాక్షి చౌదరి నటించిన సితిర పుతిరన్ (Sithira Puthiri) మ్యూజిక్ వీడియో కూడా యూత్‌లో మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా అల్లు అర్జున్-అట్లీ సినిమా ద్వారా అభ్యంకర్ పెద్ద లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంగీత దర్శకుడి టాలెంట్‌పై సినీ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment