---Advertisement---

బ‌న్నీ అరెస్టు వెన‌కున్న‌వారు స‌ర్వ‌నాశనం అవుతారు.. – చిన్న కృష్ణ

బ‌న్నీ అరెస్టు వెన‌కున్న‌వారు స‌ర్వ‌నాశనం అవుతారు.. - చిన్న కృష్ణ
---Advertisement---

స్టార్ హీరో అల్లు అర్జున్‌ని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా చంచ‌ల్‌గూడ‌ జైలులో ఉంచారు. శనివారం ఉదయం 6:45 గంటలకు జైలు వెనుక గేట్ ద్వారా ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి పంపారు. అరెస్ట్ సమయంలో బన్నీ భోజనం చేయకుండా నేలపైనే నిద్రించినట్లు సమాచారం.

ఈ ఘటనపై చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించారు. హీరోయిన్ రష్మిక, హీరో నాని, నితిన్, బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, వివేక్ ఒబెరాయ్ వంటి వారంతా ఈ అరెస్ట్‌ను తప్పుబట్టారు.

గతంలో అల్లు అర్జున్ ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’ చిత్రాలకు రచయితగా పనిచేసిన చిన్నికృష్ణ ఈ అరెస్ట్‌పై ఘాటుగా స్పందించారు. “బన్నీని అరెస్ట్ చేయడం దారుణం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కోసం తినడం మానేశాను. టికెట్ ధరల పెంపు ఈ ఒక్క సినిమాకే చేయలేదు. బన్నీ అరెస్ట్ వెనక ఉన్నవారు సర్వనాశనం అవుతారు. తరువాతి పరిణామాలు మీరే చూస్తారు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చిన్నికృష్ణ ‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’ లాంటి హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. దర్శకుడిగాను కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకున్నంత ఫలితం అందుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న చిన్నికృష్ణ, ఈ సందర్భంలో బన్నీ అరెస్ట్‌పై స్పందించడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment