ఇటీవల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై పలువురు ప్రముఖులు స్పందించినప్పటికీ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా రోజుల పాటు నిశబ్దంగా ఉన్నారు. అయితే, కడపలో ఎంపీడీవోను పరామర్శించేందుకు వెళ్లిన పవన్‌ను ఓ మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ తిప్పికొట్టిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పవన్ ఈ ప్రశ్నను ఆసక్తి లేనట్లుగా, “ఇక్కడ మనుషులు చస్తున్నారు.. మీకు సినిమాలు ప్రస్తావన అవసరమా?” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన మీడియా వర్గాల్లో చర్చలకు దారితీసింది. పవన్ వ్యాఖ్యలు సమాజం సమస్యలపై ఆయన దృష్టిని స్పష్టంగా తెలియజేస్తున్నాయని అభిమానులు అంటున్నారు.