పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఈనెల 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
నా జోక్యం లేదు
చట్టం తన పని తాను చేసుకుంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం లేదని, ఇది పూర్తిగా పోలీసుల పరిధిలోని విషయమని ఢిల్లీలో జరిగిన సమావేశంలో మీడియాతో అన్నారు. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడంతో ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు.
కేటీఆర్ ఆగ్రహం..
అల్లు అర్జున్ అరెస్ట్‌కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత, దేశానికి గర్వకారణమైన అల్లు అర్జున్ను ఒక సాధారణ నేరస్థుడిగా చూడటం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. బాధితుల పట్ల తనకు కూడా గాఢమైన సానుభూతి ఉందని, కానీ, ఈ పరిస్థితికి నిజంగా బాధ్యత వహించవలసింది ఎవరు? అల్లు అర్జున్ను ఇలా అప్రతిష్ట కలిగించడం సరికాదని అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.