సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ (బన్నీ)కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ11గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారని సమాచారం.
కాగా, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ జరుపుతోంది.
పోలీసుల బందోబస్తు
నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు చంచల్‌గూడ జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ కాన్వాయ్‌తో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అల్లు అర్జున్ అరెస్టు, 14 రోజుల రిమాండ్ విధింపు నేపథ్యంలో జైలు వద్దకు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు.








