---Advertisement---

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అరవింద్

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అరవింద్
---Advertisement---

పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య‌ థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను ప్ర‌ముఖ‌ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్ చేరుకున్న అర‌వింద్‌.. వైద్యులతో మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు.

డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా థియేటర్ బయట జరిగిన ఆ ఘటనలో శ్రీతేజ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోగా, శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ కూడా తన బాధను వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. రేవ‌తి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయంతో పాటు శ్రీ‌తేజ్ వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తామ‌ని, ఆ కుటుంబాన్ని ఏ సాయం కావాల‌న్నా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

శ్రీ‌తేజ్ హెల్త్ బులెటిన్‌
కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శ్రీ‌తేజ్ హెల్త్ బులెటిన్‌ను నిన్న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నార‌ని, మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగడం లేదని వైద్యులు పేర్కొన్నారు. జ్వరం పెరుగుతోందని, ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. బాలుడిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అన్ని అవసరమైన చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment