శ్రీ‌తేజ్‌కు అల్లు అరవింద్ ప‌రామ‌ర్శ‌

శ్రీ‌తేజ్‌కు అల్లు అరవింద్ ప‌రామ‌ర్శ‌

పుష్ప-2 (Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ (Shri Tej)‌ ను నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) వ్యక్తిగతంగా పరామర్శించారు. ప్రస్తుతం ఆసియా ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంట‌ర్‌ (Asia Transcare Rehabilitation Center)లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అరవింద్ వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

వైద్యులు అందిస్తున్న చికిత్స, అతడి ఆరోగ్యం మెల్లగా ఎలా మెరుగవుతోంది అనే విషయాలతోపాటు, పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న అంశాలపై డాక్టర్లతో చర్చించారు. బాధితుడికి అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీ‌తేజ్ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపుతున్న అల్లు ఫ్యామిలీకి కుటుంబ స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ కోలుకుంటున్నాడు. సికింద్రాబాద్ కిమ్స్‌ ఆస్ప‌త్రి గ‌త నెల 29వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్ప‌త్రి నుంచి నేరుగా రిహాబిలిటేషన్ సెంట‌ర్‌కు తరలించారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ వైద్యులు తెలిపిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment