---Advertisement---

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
---Advertisement---

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్‌కుమార్‌ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్‌ అయ్యారు. సాల్మన్‌ ఆరోఖ్య రాజ్‌ కేంద్రంలో డిప్యుటేషన్‌పై ఉన్న ఈ అధికారి పదోన్నతిని పొందారు. అదే విధంగా 2009 బ్యాచ్‌కి చెందిన‌ ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా సీఎంవో సహాయ కార్యదర్శి హోదా నుంచి కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఐఏఎస్ వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా కొనసాగిస్తారు. కడప జిల్లా కలెక్టర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఐపీఎస్ అధికారుల పదోన్నతులు
ఐపీఎస్ అధికారులు విక్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్ కూడా పదోన్నతులు క‌ల్పించారు. ఈ నిర్ణయాలు పాలనలో కీలక మార్పులకు దారితీయవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment