బాలీవుడ్ స్టార్ (Bollywood Star) నటి అలియా భట్ (Alia Bhatt) మాజీ (Former) పర్సనల్ అసిస్టెంట్ (Personal Assistant) వేదికా ప్రకాష్ శెట్టిని (Vedika Prakash Shetty) రూ.76.9 లక్షల మోసం కేసులో ముంబై పోలీసులు (Mumbai Police) బెంగళూరు (Bengaluru)లో అరెస్ట్ (Arrested) చేశారు. అలియా భట్, ఆమె ప్రొడక్షన్ హౌస్ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Eternal Sunshine Productions Pvt. Ltd) నుండి నిధులను వేదికా స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి.
మోసం వివరాలు
జూహు పోలీసులు (Juhu Police) తెలిపిన వివరాల ప్రకారం, వేదికా ప్రకాష్ శెట్టి 2021 నుండి 2024 వరకు అలియా భట్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ సమయంలో ఆమె అలియా ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు, రోజువారీ షెడ్యూల్‌ను పర్యవేక్షించేవారు. వేదికా నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ.76.9 లక్షలు అక్రమంగా తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ మోసం మే 2022 నుండి ఆగస్టు 2024 మధ్య జరిగిందని తెలుస్తోంది.
ఫిర్యాదు, అరెస్ట్
ఈ విషయం అలియా భట్ తల్లి(Mother), నటి సోనీ రజ్దాన్ (Soni Razdan) దృష్టికి రావడంతో, ఆమె ఈ ఏడాది జనవరిలో ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, వేదికా ప్రకాష్ శెట్టి (Vedika Prakash Shetty) కోసం గాలింపు చేపట్టారు. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి ఆమె తరచుగా స్థానాలను మార్చుకుంటూ వచ్చింది. చివరకు బెంగళూరులో వేదికాను గుర్తించి, అరెస్ట్ చేసి, మంగళవారం (జూలై 8) ముంబైకి తీసుకువచ్చారు. కోర్టు ఆమెకు జూలై 10 వరకు పోలీసు కస్టడీ విధించింది. జూహు పోలీసులు వేదికా ప్రకాష్ శెట్టిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 316(4) మరియు 318(4) కింద కేసు నమోదు చేశారు.








