50 ఏళ్ల వృద్ధుడిగా అఖిల్!

50 ఏళ్ల వృద్ధుడిగా అఖిల్!

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్న సినిమా ‘లెనిన్’ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ మరోసారి సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ముఖ్యంగా కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అఖిల్ 50 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ సినిమాపై హైప్ పెంచుతోంది. ఈ లుక్ కోసం అఖిల్ స్పెషల్ మేకోవర్ అయ్యాడని, దాదాపు నాలుగు నిమిషాల పాటు వచ్చే ఈ సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘లెనిన్’లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పే డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు స్పెషల్ హైలైట్‌గా మారనున్నాయని అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి మే 1న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండటంతో అక్కినేని అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment