టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సైనట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 24న అఖిల్, జైనబ్ రన్జీల వివాహం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది. వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే, ఈ వార్తలపై అక్కినేని కుటుంబం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది, అయితే పెళ్లి తేదీపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తాజా సమాచారం అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.








