బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) … ఈ పేరు చెబితేనే మాస్ జాతర ఖాయం! ‘అఖండ’ (Akhanda)తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్రాండ్ కాంబో నుంచి వస్తున్న క్రేజీ సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ (Akhanda 2 – Tandavam) కోసం దేశవ్యాప్తంగా అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ 5న పాన్‌ఇండియా (Pan-India) స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై విడుదలైన ప్రతి అప్‌డేట్ సునామీ సృష్టిస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, టెక్నికల్‌గా అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. బాలయ్య పవర్‌ఫుల్ లుక్, బోయపాటి మార్క్ యాక్షన్, మరియు మాస్ ఎలిమెంట్స్… అన్నీ కలిసి హైప్‌ను డబుల్ కాదు ట్రిపుల్ చేస్తున్నాయి!
సంచలనం సృష్టిస్తున్న రూమర్: అల్లు అర్జున్ (Allu Arjun) – రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకే వేదికపై?
ట్రైలర్ విడుదల తేదీ ఖరారైన నేపథ్యంలో, ఇక అందరి దృష్టి నెలాఖరున జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదే ఉంది. ఈ మహా వేదిక గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఓ రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరవుతారట!
ఒకే వేదికపై ముఖ్యమంత్రి, మరియు పాన్‌ఇండియా స్టార్ ప్రెజెన్స్ ఉంటే, అది కేవలం ఈవెంట్ కాదు… చరిత్ర సృష్టించే ఘట్టం అవుతుందని ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని, అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వేచి చూడాలి, బాలయ్య – బోయపాటి ‘తాండవం’కు ఎంతమంది ప్రముఖులు హాజరై, ఈ హైప్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్తారో!








