ఫైనాన్షియల్ ఇష్యూతో ‘అఖండ 2’ వాయిదా.. రిలీజ్‌పై క్లారిటీ

ఫైనాన్షియల్ ఇష్యూతో 'అఖండ 2' వాయిదా.. రిలీజ్‌పై క్లారిటీ

బాలకృష్ణ (Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2 తాండవం’ (Akhanda 2 Tandavam) చిత్రం విడుదలపై గత రెండు రోజులుగా భారీ ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రి నిర్మాతలు (Producers) చిత్రం విడుదలను వాయిదా (Postponement) వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అసలు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు థియేటర్లలో విడుదల కావాల్సిన అఖండ 2 తాండవం అనూహ్యంగా వాయిదా ప‌డింది. అయితే 14 రీల్స్ (14 Reels) నిర్మాణ సంస్థ, ఈరోస్ (Eros) అనే సంస్థకు చెల్లించాల్సిన రూ. 28 కోట్లు, వడ్డీ (Interest) చెల్లింపు వ్య‌వ‌హారంలోనే సినిమా నిలిచిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించిన ప్ర‌కారం బెనిఫిట్ షోకు రూ.600 పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. తీరా సినిమా వాయిదా అని చివ‌రి క్ష‌ణాల్లో ప్ర‌క‌ట‌న రావ‌డంతో బాల‌య్య అభిమానులంతా చిత్ర నిర్మాణ సంస్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజా సమాచారం ప్రకారం..
ఈరోస్ సంస్థ‌కు చెల్లించాల్సిన మొత్తం సంబంధించి రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. రూ.28 కోట్ల‌తో పాటు స‌గం వ‌డ్డీ డ‌బ్బులు ఇప్పుడు, మిగిలిన బకాయి మూవీ విడుదలైన 50 రోజుల్లో చెల్లించేందుకు అంగీకరించిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. కోర్టు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు (Premiere Shows) ప్లాన్ చేస్తున్నారు. రేపటి నుండి రెగ్యులర్ షోలు పడనున్నాయని స‌మాచారం. సినిమా కంటెంట్ ఇప్పటికే అన్ని థియేటర్లకు డెలివర్ అయినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం అఖండ ఫ్రాంచైజ్‌పై భారీ హైప్ నెలకొల్పింది.

అఖండ 2 తాండవం ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పటికే ట్రైలర్ స్థాయిలోనే రికార్డు స్థాయి బజ్ క్రియేట్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment