‘అఖండ 2’కు జీవో వచ్చే అవకాశం, టికెట్ ధర పెంపు?

'అఖండ 2'కు జీవో వచ్చే అవకాశం, టికెట్ ధర పెంపు?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ-2’ (Akhanda-2). గతంలో సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ‘అఖండ-2’ ఫస్ట్ గ్లిమ్స్ (First Glimpse) కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. అందులో భాగంగా, ఈ రోజు సాయంత్రం బెంగళూరులో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా, ‘అఖండ-2’ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. కంటెంట్ పట్ల మేకర్స్ పూర్తి ధీమాతో ఉండడంతో, ఈ సినిమాను నిర్ణీత విడుదల తేదీ కంటే ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబరు 4న, పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ ధరలు పెంచుకునేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతుల జీవో (GO) కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వంతో స‌న్నిహిత సంబంధాలు, ఇక ఏపీలో అధికారం మ‌న‌దే, కాబ‌ట్టి టికెట్ ధ‌ర‌లు పెంచే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment