---Advertisement---

కార్ రేసింగ్‌.. హీరో అజిత్‌కు త‌ప్పిన పెను ప్రమాదం

హీరో అజిత్‌కు త‌ప్పిన పెను ప్రమాదం
---Advertisement---

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌కు (Ajith Kumar) పెను ప్ర‌మాదం త‌ప్పింది. దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయ‌న రేసింగ్ కారు ప్ర‌మాదానికి గురైంది. రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అజిత్ పెద్ద ప్రమాదం నుంచి బ‌య‌ట‌పడ‌డంతో ఆయ‌న అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అజిత్‌కు బైక్‌, కార్ రేసులంటే చాలా ఇష్ట‌మ‌ని, స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా బైక్‌పై లాంగ్ డ్రైవ్‌ల‌కు వెళ్తార‌ని, సేఫ్టీ ప్రికాష‌న్స్ తీసుకొనే ఆయ‌న బైక్ న‌డుపుతార‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. కార్ రేస్ అంటే కూడా ఆయ‌న‌కు ఇష్ట‌మ‌ని చెబుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment