క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, టీమిండియా వెటరన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత ఆటగాడుగా రహానే నిలవనున్నాడు.
ఈ ఘనతతో ధోని, రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లను అధిగమించనున్నాడు. క్రికెట్ ప్రియులు ఇప్పుడు రహానే కొత్త రికార్డు గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.