భారతదేశం (India)లో క్రికెట్ (Cricket)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) అనే టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ మొదలైంది. ఈ లీగ్‌లో ఇప్పుడు ఎనిమిదో జట్టుగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ చేరింది.
ఈ అహ్మదాబాద్ (Ahmedabad) జట్టును బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కొనుగోలు చేశారు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు యజమానులుగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ (మజీ ముంబై), సల్మాన్ ఖాన్ (న్యూఢిల్లీ), సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్‌కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మరియు రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) ఇప్పటికే జట్లను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ జాబితాలో చేరారు.
ISPL కోర్ కమిటీ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఈ లీగ్ ద్వారా ప్రతిభావంతులకు మంచి అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. లీగ్ మూడో సీజన్ కోసం ఇప్పటికే నలభై లక్షలకు పైగా ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
గత రెండు సీజన్ల విజేతలు:
మొదటి సీజన్: టైగర్స్ ఆఫ్ కోల్‌కతా (మజీ ముంబైపై గెలిచింది).
రెండో సీజన్: మజీ ముంబై (శ్రీనగర్ కే వీర్‌పై గెలిచింది).