ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖమైన నటీమణుల్లో ఒకరు ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai). తన అపురూపమైన అందం, ప్రతిభతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. టాప్ సెలబ్రిటీలకు భద్రత ఎంతో కీలకం. ఈ క్రమంలో, ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత రక్షకుడిగా ఉన్న శివరాజ్ (Shivraj) గురించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
బాడీగార్డ్ జీతం ఎంత?
సెలబ్రిటీల రక్షణకు అత్యంత నమ్మకమైన సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తారు. ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ (Bodyguard) అయిన శివరాజ్ జీతం (Salary) గురించి తాజాగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అధికారిక సమాచారం బయటకు రాకపోయినా, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆయన వార్షిక వేతనం రూ. కోటిన్నర (1.5 కోట్లు) పైగా ఉండవచ్చని చెబుతున్నారు.
సెలబ్రిటీలకు భద్రత ముఖ్యం?
ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రజల్లోకి వెళ్లినప్పుడు భారీ జనసంద్రాన్ని ఎదుర్కొంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది వారి వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే, టాప్ సెలబ్రిటీల భద్రతకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.