ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఈరోజు ఉదయం నుండి దేశ వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో కాల్స్ చేయడం, మెసేజులు పంపడం, అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయలేకపోయారు.
ఈ సమస్య గురించి వినియోగదారులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ఇంటర్నెట్ పనిచేయడం లేదు, నా ఫోన్లో నెట్వర్క్ సిగ్నల్ కూడా కనిపించడం లేదు” అంటూ చాలామంది తమ సమస్యను పంచుకున్నారు.
డౌన్ డిటెక్టర్లో ఉదయం 10:30 గంటల నుంచే నెట్వర్క్ సమస్యలపై నివేదికలు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎయిర్టెల్ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వినియోగదారులు, సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.








