టాటా గ్రూపు (Tata Group) నకు చెందిన ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్–పాక్ (India-Pakistan) మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడంతో, విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్పుతో ప్రయాణ సమయం గణనీయంగా పెరగనుంది. తద్వారా విమాన ఖర్చులు అధికమవడం వల్ల టికెట్ ధరలు (Ticket Prices) కూడా పెరిగే అవకాశముందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా (Alert) ఉండాలని సూచిస్తున్నారు.
పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన కాల్పుల్లో 26 మంది భారతీయులు (Indians) మృత్యువాతపడ్డారు. ఉగ్రదాడిని భారత్ సీరియస్‌గా తీసుకుంది. టెర్రరిస్టులకు ప్రధానమంత్రి (Prime Minister) సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చారు. సింధు నది జలాలను (Indus River Water) భారత్ (India) నిలిపివేసింది. భారత్ చర్యకు పాక్ కూడా తమ గగనతలంలోకి ఇండియా విమానాలకు నిషేధం విధించింది.ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.