ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఆప్రాన్‌పై నిలిపివేత‌

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఆప్రాన్‌పై నిలిపివేత‌

విజ‌య‌వాడ (Vijayawada) గన్నవరం ఎయిర్‌పోర్టులో (Gannavaram Airport) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు (Air India Express Flight) చెందిన విమానం ఒక్కసారిగా నిలిచిపోయింది. విశాఖపట్నం బయలుదేరే సమయంలో విమాన ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని ఆప్రాన్‌పై నిలిపివేశారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 7.30కి గన్నవరం చేరుకుని, 8 గంటలకు విశాఖకు బయలుదేరాల్సి ఉంది.

ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీతో పాటు మొత్తం 165 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది.

విమానం నిలిచిపోవడంతో వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు వెళ్లగా, మంత్రి అచ్చెన్నాయుడు సహా వైసీపీ నేతలు విజయవాడకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఎయిర్‌పోర్టులో కొంతసేపు కలకలం రేపింది. విమానం ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణికులంతా వెనుదిరిగి వెళ్లిపోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment