కెనడాలో 700 విమానాల‌కు బ్రేక్‌!!

కెనడాలో 700 విమానాలు రద్దు!

ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్లు వేతనాల పెంపు కోసం సమ్మెకు దిగడంతో, విమానయాన సేవల‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డింది. కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ (CUPE) ఇచ్చిన సమ్మె నోటీసు గడువు పూర్తికావడంతో, ఎయిర్ కెనడా మరియు దాని అనుబంధ సంస్థ ఎయిర్ కెనడా రూజ్ (Air Canada Rouge) తమ సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం
ఈ సమ్మె కారణంగా విమానయాన రంగంలో భారీ అంతరాయం ఏర్పడింది. రోజుకు సగటున 1.3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 విమానాలు రద్దు అయ్యాయి. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు నిలిచిపోగా, ప్రత్యామ్నాయ సదుపాయాల కోసం ఎయిర్‌లైన్ తీవ్రంగా కష్టపడుతోంది.

చర్చలు విఫలమైందే కారణం
ఫ్లైట్ అటెండెంట్ల వేతనాల పెంపు డిమాండ్లపై నిర్వహించిన చర్చలు విఫలమైనందువల్లే సమ్మె తప్పదని యూనియన్ స్పష్టం చేసింది. దీని ప్రభావం కెనడాలో మాత్రమే కాకుండా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారం కోసం త్వరలోనే కెనడియన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడనుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. అంతవరకు ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment