ఈద్ (Eid) ప్రార్థనలపై మరోసారి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) నేతలు రోడ్డుపై నమాజ్ (Namaz) చేయడం తగదని వ్యాఖ్యలు చేయగా, AIMIM పార్టీ దీనిపై తీవ్రంగా స్పందించింది. AIMIM ఢిల్లీ అధ్యక్షుడు షోయబ్ జమాయి (Shoeb Jamai) “మసీదుల్లో స్థలం లేకపోతే, రోడ్డుపైనే నమాజ్ చేస్తాం” అంటూ బహిరంగంగా ప్రకటించారు.
AIMIM రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమాయ్ సోషల్ మీడియా (Social Media)లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ బీజేపీ నాయకుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. “ఈద్ ప్రార్థనల గురించి కొంతమంది బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఢిల్లీ (Delhi).. అందరిదీ. మసీదులో స్థలం లేకపోతే, రోడ్డుపైనా, ఇళ్ల స్లాబ్‌లపై కూడా నమాజ్ చేస్తాం. కవాడ్ యాత్ర (Kawad Yatra) సమయంలో ప్రధాన రహదారులను గంటల పాటు మూసేస్తారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. అలానే నమాజ్‌కు 15 నిమిషాల సమయం ఇవ్వాలి. నమాజ్‌కు సంబంధించి పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలి” అని ఆయన కోరారు.
బీజేపీ నేతల నిరసన..
ఇక బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిషేధించాలని డిమాండ్ చేస్తూ షకూర్ బస్తీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ (Karnail Singh) ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. రోడ్లపై ప్రార్థనలు జరపడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ను నిషేధించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ (Mohan Singh Bisht) కూడా ఇదే డిమాండ్‌ను లేవనెత్తారు. దీంతో ఢిల్లీ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ, తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.