గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఘోర విమాన ప్రమాదం (Airplane Accident) జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం (Air India Aircraft) (విమానం నెం. AI171) టేకాఫ్(Takeoff) అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయిన (Crashed) ఘోర దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. లండన్ (London)లోని గాట్విక్ విమానాశ్రయానికి (Gatwick Airport) బయలుదేరిన ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (Boeing 787 Dreamliner) విమానంలో 232 మంది ప్రయాణికులు, 2 మంది పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మేఘానినగర్ (Meghaninagar)లోని జనావాస ప్రాంతంలో విమానం చెట్టును ఢీకొని కూలిపోవడంతో భారీ మంటలు, దట్టమైన నల్లని పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. విమాన ప్రమాద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గురువారం 1:38 గంటలకు రన్‌వే 23 నుంచి టేకాఫ్ అయ్యింది. కేవలం రెండు నిమిషాల్లోనే 1:40 గంటలకు, విమానం 825 అడుగుల ఎత్తు నుంచి హఠాత్తుగా కిందపడింది. విమానాశ్రయ సమీపంలోని జనావాస ప్రాంతంలో కూలిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) (DGCA) ప్రకారం, విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) (ATC)కి మేడే కాల్ చేసింది, కానీ ఆ తర్వాత ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. విమానం పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (Captain Sumeet Sabharwal) (8,200 గంటల ఫ్లైయింగ్ అనుభవం) ఆదేశంలో ఉండగా, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ (First Officer Clive Kundar) (1,100 గంటల అనుభవం) సహాయకుడిగా ఉన్నారు.
ఘటనా స్థలానికి 25 ఫైర్ ఇంజన్లు, డజన్ల కొద్దీ అంబులెన్స్‌లు, బీఎస్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. అహ్మదాబాద్, వడోదర, సూరత్‌ల నుంచి రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. క్షతగాత్రులను సమీపంలోని సివిల్ ఆస్పత్రి, కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు తరలించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాయపడినవారి చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM), రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి (State Home Minister Harsh Sanghavi), అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ ఘటనను ధృవీకరిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Former Gujarat CM Vijay Rupani) ఈ విమానంలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.
అహ్మదాబాద్‌లో కూలిపోతున్న ఎయిర్ ఇండియా విమానం
— Telugu Feed (@Telugufeedsite) June 12, 2025
సోషల్ మీడియాలో వీడియో వైరల్#PlaneCrash #Ahmedabad #AirIndia #Gujarat https://t.co/e0oyhFBvph pic.twitter.com/PGD9n4sXkx