---Advertisement---

Earthquake : ఆఫ్ఘాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన‌ ప్రకంపనలు

Earthquake : ఆఫ్ఘాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన‌ ప్రకంపనలు
---Advertisement---

ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) హిందూకుష్ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Richter Scale)పై దీని తీవ్రత 6.9గా నమోదు అయినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 121 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్క‌సారిగా కంపించ‌డంతో ఆఫ్ఘాన్ ప్ర‌జ‌లు (Afghan People) భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఈ భూకంప ప్రకంపనలు పాకిస్థాన్, ఉత్తర భారతదేశంలో కూడా తాకాయి. భార‌త‌దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంత మంది భయంతో వీధుల్లోకి చేరారు. కాగా, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అందలేదని అధికారులు వెల్లడించారు. సహాయ బృందాలు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment