బాలీవుడ్ లో మరో ప్రేమ జంట..

బాలీవుడ్ లో యువ జంట.. ఆదిత్య చోప్రా సీక్రెట్ సలహా!

బాలీవుడ్‌ (Bollywood)లో యువ నటీనటులంతా ఎవరితో ఒకరితో ప్రేమలో ఉన్నారనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో ప్రేమలో ఉండగా, ఆమె సోదరి ఖుషీ కపూర్ (Khushi Kapoor) వేదాంగ్ రైనా (Vedang Raina)తో డేటింగ్ (Dating) చేస్తుందని వార్తలు వచ్చాయి. వారి స్నేహితురాలు అనన్య పాండే, తారా సుతారియా కూడా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త జంట చేరింది.

‘సైయారా’ (‘Saiyara’)అనే చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకున్న అనీత్ పద్దా, తన కోస్టార్ అహన్ పాండేతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ‘సైయారా’ షూటింగ్ సమయంలోనే వారి పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది. వీరు కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారట. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా వారికి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారని వార్తలు వచ్చాయి. అది, తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా కొనసాగించమని. అందుకే వారు రహస్యంగా ప్రేమించుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

‘సైయారా’ చిత్రంతోనే అహన్ పాండే హీరోగా అరంగేట్రం చేశాడు. అనీత్‌కు ఇది రెండో సినిమా అయినా, ఇందులో ఆమె ప్రధాన నటి పాత్ర పోషించింది. వీరి ప్రేమ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment