అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ వివాదం.. స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే

వైఎస్ఆర్ (YSR) జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech Cement Factory) వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) స్పందించారు. E సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా
ఈ వివాదంపై తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ, “నాది తప్పని తేలితే నేనే ముందుగా రాజకీయాల నుంచి వైదొలగుతా” అంటూ స్పష్టం చేశారు. సత్యం తనవైపేనని నమ్మకం వ్యక్తం చేసిన ఆయన, పరిశ్రమ యాజమాన్యం వైసీపీ (YCP) చెప్పినట్లు నడుస్తోందని ఆరోపించారు. సిమెంట్ కర్మాగారాల యజమానులు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆదినారాయణరెడ్డి, “మా ప్రాంతీయుల హక్కుల కోసం పోరాడుతున్నా” అన్నారు. కేవలం లాభాపేక్షతో కాకుండా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు పనిచేయాలని సూచించారు.

కాంట్రాక్టుల కోసం బెదిరింపులు..
సిమెంట్ ముడి స‌రుకుల (Raw Materials) ర‌వాణా కాంట్రాక్ట్ (Transport Contract) మొత్తం త‌న అనుచ‌రుల‌కు (Followers) అప్పగించాల‌ని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సిమెంట్‌ సంస్థల (Cement Companies)పై ఒత్తిడి (Pressure) చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా, అవి చాలవంటూ మొత్తం ఇవ్వాల‌ని స‌ద‌రు కంపెనీల‌ను డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి డిమాండ్‌కు సిమెంట్ సంస్థలు స్పందించకపోవడంతో, ఆయన అనుచరులు పరిశ్రమలకు అవసరమైన ముడిసరకులైన ఫ్లైయాష్, సున్నపురాయి రవాణా రహదారులను అడ్డుకున్నారు. దీంతో చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్లలోని మరో ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment