ఆది పినిశెట్టి మరోసారి తన నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘వైశాలి’ లాంటి రొమాంటిక్ మూవీ నుంచి ‘సరైనోడు’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎదురుగా నిలిచిన పవర్ఫుల్ విలన్ పాత్ర వరకు, విభిన్నమైన క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆది, ఈసారి ఒక ప్రభావవంతమైన మీడియా సంస్థ అధిపతి పాత్రలో కనిపిస్తున్నాడు. పేరు, పరపతి, శక్తి అన్నీ ఉన్న వ్యక్తిగా అతని జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, అనూహ్యంగా ఒక మిస్టరీ హ్యాకర్ అతని కంపెనీని టార్గెట్ చేయడం కథకు మలుపు తిప్పుతుంది.
ఆ హ్యాకర్ దాడులతో కేవలం వ్యాపారమే కాదు, అతని వ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. ఎవరు ఆ హ్యాకర్? ఎందుకు అతనినే టార్గెట్ చేశాడు? అన్న ప్రశ్నలతో కథ ముందుకు సాగుతూ, హై-స్టేక్స్ టెన్షన్, యాక్షన్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను సీట్ అంచులపై కూర్చోబెట్టేలా రూపొందుతోంది. ఆది పినిశెట్టి కెరీర్లో మరో ఇంటెన్స్, థ్రిల్లింగ్ మూవీగా ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసిందని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీ థియేట్రికల్ + OTT రిలీజ్ సినిమా డిసెంబర్ 12, 2025 న థియేటర్ల్లో విడుదలై, తరువాత Amazon Prime Video ద్వారా జనవరి 2, 2026 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.








